ఆదివారం కావడంతో సరదాగా గడుపుదాం అనుకున్న ఆ 12 ఏళ్ల బాలుడికి అదే చివరి రోజు అయింది. గ్రామంలోనే ఉన్న ఓ మంచి నీటి చెరువు దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లిన ఆ బాలుడు, ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. అక్కడున్న చిన్న పిల్లలు కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. గ్రామస్థులు చెరువు దగ్గరకు చేరుకుని ఆ బాలుడిని బయటకు తీశారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో జరిగింది.