Tirupati: మరో ఆలయం ధ్వంసం.. తిరగబడిన స్థానికులు

1 year ago 33
తిరుపతి జిల్లాలో మరో ఆలయం ధ్వంసమైంది. ఇటీవల తిరుచానూరు సమీపంలోని వారాహి ఆలయాన్ని కొంతమంది నేలమట్టం చేశారు. ఈ ఘటన మరువకముందే తిరుపతి సమీపంలోని దామినీడులో నాగులమ్మ ఆలయాన్ని కొంతమంది ధ్వంసం చేశారు. దామినీడులో భూ ఆక్రమణదారుల దౌర్జన్యంతోనే ఆలయాన్ని ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో నాగులమ్మ ఆలయం కూల్చివేశారని చెప్తున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే గుడి మెుత్తం కూల్చేశారని చెబుతున్నారు. మరోవైపు ఉదయం ఆక్రమణదారులపై స్థానికులు తిరగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల సమక్షంలోనే గొడవ జరిగింది. అయితే భూమిపై తమకు హక్కు ఉందని ఆక్రమణదారులు చెప్తుండగా.. రాత్రికి రాత్రే ఎందుకు కూల్చివేతలు చేపట్టారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Read Entire Article