తిరుపతి శివారు ప్రాంతంలో ఓ ఇద్దరు యువకులు మద్యం తాగేందుకు వెళ్లారు. అప్పటికే అక్కడ మరో వ్యక్తి కూడా మద్యం తాగుతున్నాడు. అయితే, తమ వెంట ఎలాంటి స్టఫ్ తెచ్చుకోకపోవడంతో.. పక్కనున్న వ్యక్తిని బైక్ ఇవ్వాలని, స్టఫ్ తెచ్చుకుంటామని అడిగారు. కానీ, ఆ వ్యక్తి బైక్ ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ ఇద్దరు యువకులు బీరు సీసాలతో అతని తలపై కొట్టి, ఆ పక్కనే ఉన్న పెద్ద రాయితో ముఖంపై మోది హత్య చేశారు.