Tirumala: శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత.. భయపడిపోయిన భక్తులు

1 year ago 40
తిరుమలలో చిరుతల సంచారం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత కన్పించటంతో భక్తులు భయపడిపోయారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గంలో 500వ మెట్టు వద్ద చిరుత కనిపించింది. ఆదివారం ఉదయం పొదల మాటున ఉన్న చిరుతను భక్తులు గమనించారు. చిరుతను చూసి భయంతో పరుగులు తీశారు. భక్తుల సమాచారంతో టీటీడీ భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సైరన్‌ మోగించారు. అలాగే అరగంటపాటు శ్రీవారి మెట్టు చెకింగ్‌ పాయింట్‌ వద్ద భక్తులను నిలిపివేశారు. చిరుత అడవిలోకి వెళ్లిపోయిందని నిర్ధారించుకున్నాక గుంపులుగా పంపించారు.
Read Entire Article