తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ట్రస్టులు, పథకాల దాతల ప్రివిలేజెస్‌లో మార్పులు చేసింది. ఇవాళ్టి (జూలై 14) అర్ధరాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. అలాగే ఎస్ఎస్‌డి భక్తులకు నూతన షెడ్లు, క్యూలైన్లు నిర్మించాలని టీటీడీ పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. రూ.17.84 కోట్లతో ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణంతో పాటుగా.. వేద పారాయణ స్కీం ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.