అతని వయస్సు 29 సంవత్సరాలు.. పెళ్లయ్యి చాలా కాలమైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మనస్పర్థలు రావడంతో భార్యభర్తలు విడిపోయారు. అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఇంటికి పెద్ద కొడుకు కాగా, చిన్నోడు ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్. అయితే, ఇటీవల కాలంలో తాగొచ్చి ఇంట్లో అందర్నీ వేధిస్తున్నాడు. చిన్నోడికి పెళ్లి చేస్తే ఒప్పుకోనని, ఆస్తిని కూడా తనకే ఇవ్వాలంటూ గోల చేస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, చిన్న కుమారుడు కలిసి పెద్దోడిని హత్య చేశారు. ఈ ఘటన బాపట్ల జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది.