శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉదయం వేళ విద్యార్థులు, సిబ్బంది అందరూ కూర్చొని ఉండగా టీ తీసుకొచ్చారు. కానీ పీఈటీ, సెక్యూరిటీకి మాత్రం ఓ సపరేట్ జగ్గులో టీ వచ్చింది. ఆ టీ తాగిన తర్వాత ఆ ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. అందులో ఈగల మందు కలపడంతోనే ఇలా జరిగిందని, తోటమాలే ఆ ఈగల మందు కలిపిందంటూ పీఈటీ ఆరోపణలు చేశారు.