Shamshabad Accident: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

1 month ago 11
శంషాబాద్‌లో ఇవాళ అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, గాయపడిన మరో వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Entire Article