Palnadu: వెంకటేశ్వరస్వామి ఆలయంపై దాడి.. విగ్రహాలు ధ్వంసం..

1 year ago 27
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఆగంతకులు రెచ్చిపోయారు. పల్నాడు జిల్లా క్రోసూరులో ఆలయంపై దాడికి పాల్పడ్డారు. క్రోసూరులోని వెంకటేశ్వరస్వామి గుడిపై దాడి చేసిన దుండగులు.. విగ్రహాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను గుడిలో నుంచి బయట పడేశారు. గుడిలోని వస్తువులకు నిప్పటించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా .. శనివారం ఉదయం స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా చేశారా.. ఆకతాయిల పనా అనేదానిపై ఆరా తీస్తున్నారు.
Read Entire Article