Palapitta: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. అటవీ శాఖ కీలక ఆదేశాలు

1 month ago 12
Indian Roller: దసరా సందర్భంగా పాలపిట్టలను బంధించి ప్రదర్శించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అటవీ దళాల అధిపతి వినయ్‌ కుమార్‌ ఆదేశించారు. పంజరాల్లో ఉంచితే పాలపిట్టలు ఆహారం తీసుకోక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. గత దసరా సమయంలో బంధించిన 28 పాలపిట్టలను స్వాధీనం చేసుకుని విడుదల చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో పక్షులను బంధించకుండా దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. చైనా మాంజా వల్ల పక్షులు, ప్రజలకు ప్రమాదం ఉన్నందున దాని విక్రయాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article