Oil Palm: తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగుకు సబ్సిడీ.. ఎకరానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

1 month ago 9
Oil Palm Farmer Income: తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడాది కాలంలో రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. కాగా, త్రిభుజాకార పద్ధతిలో ఎకరానికి 57 ఆయిల్ పామ్ మొక్కలు నాటవచ్చు. తొలి నాలుగేళ్లలో తోట ఏర్పాటు, నిర్వహణకు సుమారు రూ.1.20 లక్షల వ్యయం అవుతుందని అంచనా. నాలుగో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. పూర్తిస్థాయి ఉత్పత్తి దశలో ఏడాదికి 8–10 టన్నుల గెలలు రావచ్చు. ప్రస్తుత ధరల ఆధారంగా ఆదాయం రూ.1.92–2.40 లక్షల వరకు ఉండొచ్చు. ఖర్చులు పోను నికర ఆదాయం ఎకరాకు రూ.1–1.20 లక్షలుగా అంచనా.
Read Entire Article