నీట్ పరీక్షా పేపర్ల లీక్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. పరీక్ష పేపర్ లీక్ కావటంతో ఎన్‌టీఏ నీట్ పరీక్ష 2026ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై షర్మిల విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకులకు కేరాఫ్‌గా మారాయని.. ఈ సామ్రాజాన్ని ప్రధాని మోదీ దేశమంతా విస్తరిస్తున్నారంటూ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు పేపర్ల లీక్ వ్యవహారాన్ని ఎన్టీఏ సీబీఐకు అప్పగించింది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.