మంత్రి సీతక్క ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్ట్ రాశారు. ఇప్పటికే ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్‌ఎం, పీహెచ్‌డీ పట్టాలు పొందిన మంత్రి సీతక్క.. తాజాగా మరో ఎల్ఎల్ఎం పట్టా పొందడం కోసం.. ప్రవేశ పరీక్ష రాశారు. చదువు, డిగ్రీలపై ఆమెకు ఉన్న ఇష్టం.. మంత్రి హోదా, వయసు, బిజీ షెడ్యూల్ వంటివి ఏమీ సీతక్కను చదువుకోకుండా ఆపలేదని.. తాజా సంఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకప్పుడు అడవుల్లో ఉండి పోరాటం చేసిన సీతక్క.. ఇప్పుడు మంత్రిగానూ.. అనేక డిగ్రీలు పొందిన విద్యావేత్తగానూ మారారు.