Laptop Offers: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. కేవలం రూ.4 వేలకే బ్రాండెడ్ ల్యాప్‌టాప్..

5 months ago 14
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో కేవలం 4,000 రూపాయలకే ల్యాప్‌టాప్ ఇస్తామన్న ప్రకటన ఆదివారం భారీ గందరగోళానికి దారితీసింది. ఈ బంపర్ ఆఫర్ గురించి తెలుసుకున్న వేలాది మంది జనం తెల్లవారుజాము నుంచే దుకాణం ముందు క్యూ కట్టారు. రద్దీ విపరీతంగా పెరగడంతో ఊపిరాడక జనం ఇబ్బంది పడ్డారు. తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేయించారు. భారీ లాభాల కోసం తగిన భద్రతా ఏర్పాట్లు చేయకుండా ఇలాంటి సేల్స్ నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article