Kurnool: హైవేపై జాగింగ్ చేస్తున్న పోలీస్.. సడెన్‌గా ఢీకొట్టిన వాహనం, అక్కడికక్కడే మృతి

1 week ago 3
కర్నూలులో మంగళవారం ఓ ఘోర ఘటన చోటుచేసుకుంది. ఎప్పటిలాగే జాగింగ్‌కి వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్‌ను వేగంగా వస్తున్న ఓ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను ఫ్లై ఓవర్ నుంచి కింద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన రద్దీగా ఉండే బళ్లారి చౌరస్తా దగ్గర చోటుచేసుకుంది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Entire Article