Kalvakuntla Kavitha: దేశంలో కుటుంబాలను చీల్చిన రాజకీయాలు.. సొంత పార్టీని వీడి వేరు కుంపట్లు, అత్యధికం అట్టర్ ఫ్లాప్

10 months ago 13
Kalvakuntla Kavitha: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది తలపండిన నేతలు చెప్పేమాట. ఇది అక్షరాలా సత్యం. ఎందుకంటే అప్పటివరకు కలిసి ఉన్నవారు.. ఏదో ఒక కారణం వల్ల విడిపోవడం.. రాజకీయంగా నిత్యం విమర్శించుకునేవారు ఎన్నికల వేళ కలిసి పోటీ చేసిన సంఘటనలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో, రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం. ఇక సొంత పార్టీలో ఉండలేక లేదా పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపించి బహిష్కరణకు గురై.. సొంత కుటుంబ సభ్యుల నుంచే బయటికి పంపించబడిన నేతలు, నాయకురాళ్లు కూడా ఉన్నారు. ఇలా సొంత కుటుంబ సభ్యుల చేతిలో అవమానం, సొంత పార్టీ నుంచి బహిష్కరణ ఎదురైన తర్వాత.. బయటికి వెళ్లి కొత్త పార్టీలను స్థాపించడం లేకపోతే.. తమ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీల్లో చేరడం దేశవ్యాప్తంగా జరుగుతున్న కథలే. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పరిణామాలు జరిగిన పార్టీల సంగతి ఒకసారి చూద్దాం.
Read Entire Article