ఐదేళ్ల కొడుకు.. పసిబిడ్డ అలాంటి వాడిని ఓ తల్లి దారుణంగా హతమార్చింది. నోట్లో వస్త్రాలు కుక్కి, గొంతుకు చున్నీ బిగించి అతి కిరాతకంగా హత్య చేసింది. భార్యభర్తల మధ్య గొడవల కారణంగానే ఆ తల్లి అలా చేసింది. ఫిబ్రవరి 12న హతమార్చితే ముందుకు ఎవరికీ అనుమానం రాలేదు.. తర్వాత ఆమె ప్రవర్తనలో తేడా రావడంతో భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో కొడుకును తానే హత్య చేశానని ఆమె అంగీకరించింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటుచేసుకుంది.