వృద్ధులు, నిరక్షరాస్యులను టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తి ఏటీఎం దగ్గర మోసాలకు పాల్పడుతున్నాడు. ఎవరైనా సాయం చేయాలని అడిగితే వారికి డబ్బులు డ్రా చేసి ఇచ్చి, వారి పిన్ నెంబర్ తెలుసుకుని ఏటీఎం కార్డు మార్చి ఇస్తాడు. వారు ఏటీఎం నుంచి వెళ్లిపోగానే వాళ్ల ఖాతాలోని డబ్బులు తీసుకుంటాడు. ఇలానే ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు అకౌంట్ నుంచి రూ. 50 వేలు తస్కరించాడు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.