అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో అత్తమామల నుంచి భారీగానే కట్నకానుకలు తీసుకున్నారు. పెళ్లయి మూడు నెలల వరకూ అంతా బాగానే ఉంది. ఆ ఇద్దరి సంసారం సంతోషంగా సాగింది. ఆ తర్వాత నుంచి అత్తమామలు, అటు వైపు బంధువులతో పాటు భర్త కూడా ఆమెను వేధించడం మొదలు పెట్టారు. నీకు జబ్బు ఉందని.. నువ్వు అందంగా లేవంటూ వేధించసాగారు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకోగా.. ఆత్మహత్యకు కారకులను పోలీసులు అరెస్ట్ చేశారు.