Jubilee Hills By Election Result Live: జూబ్లీ'హిల్స్' ఎక్కేదెవరో.. కాసేపట్లో కౌంటింగ్, ఫలితంపై ఉత్కంఠ

8 months ago 19
Jubilee Hills By-Poll Election Results Today Live: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ కోసం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించడానికి 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 186 మంది సిబ్బంది ఈ కౌంటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ ఉపఎన్నికలో కేవలం 48.49 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. మొత్తం 1,94,631 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా బోరబండ డివిజన్‌లో 55.92 శాతం, అత్యల్పంగా సోమాజిగూడలో 41.99 శాతం ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియ 10 రౌండ్లలో పూర్తి కానుంది, మధ్యాహ్నం కల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం..
Read Entire Article