Janasena: పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు.. జనసేన వార్నింగ్, ఆయనను ఉద్దేశించేనా?

11 months ago 25
జనసేన పార్టీ కీలక ప్రకటన జారీ చేసింది. పార్టీ ముఖ్య నేతలను, నాయకులను ఉద్దేశించి కీలక ప్రకటన ఇచ్చింది. పార్టీ లైన్ దాటి ప్రవర్తించవద్దని.. ఎవరైనా హద్దు మీరి మాట్లాడితే కఠిన చర్యలు ఖాయమని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు జనసేన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. అయితే జనసేన పార్టీ ప్రకటన ఎవరిని ఉద్దేశించి అనేది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికకరంగా మారింది. అయితే గురువారం జనసేనకు చెందిన ఓ నేత చేసిన ట్వీట్ వైరల్ కాగా.. ఈ ప్రకటన ఆయనను ఉద్దేశించి చేసిందేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article