కూతుర్ని ఎక్కడో ఇస్తే ఎలా ఉంటుందో, ఏమో అనుకున్న ఆ తల్లిదండ్రులు మేనమామకే ఇచ్చి పెళ్లి చేశారు. 2018లో వివాహం కాగా కొన్నాళ్ల పాటు వీరిద్దరి సంసారం సంతోషంగానే సాగింది. అయితే, ఇద్దరి మధ్య వివాదాలు మొదలవ్వడంతో.. భర్తతో కాపురం చేయలేనంటూ పుట్టింటికి వచ్చింది. పెద్ద మనుషులు రాజీ కుదర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే, ఏమైందో ఏమో పుట్టింట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో చోటుచేసుకుంది.