హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి భాాగ్యనగరం వణికిపోయింది. ఇక, కుండపోత వర్షానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగుళూరుకు మళ్లించారు. ఇక, శనివారం కూడా పలు విమానాలను దారి మళ్లించినట్టు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, వారణాసి నుంచి వచ్చే 9 విమానాలు పలు నగరాలకు మళ్లించారు.