'పేదలు తలచుకుంటే గద్దె దించుతారు..' సెక్రటేరియట్ వద్ద పోస్టర్లు, పోలీసుల అదుపులో మహిళ

2 hours ago 1
తెలంగాణ సచివాలయం మీడియా సెంటర్ వద్ద పోస్టర్లు కలకలం రేపాయి. ఉచిత పథకాలు వద్దని, ప్రతి పేదవాడికి ఇల్లు, యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రమ్య అనే పేరుతో చేతిరాతతో కూడిన పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఉన్న ఈ పోస్టర్లను గమనించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వాటిని తక్షణమే తొలగించారు. అనంతరం ఆ పోస్టర్లు అంటించిన మహిళను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.
Read Entire Article