HYD: వాట్సాప్ కాల్‌తో వల.. ట్రేడింగ్ పేరిట రూ.6 కోట్లు ముంచేసిన కేటుగాళ్లు

1 week ago 3
హైదరాబాద్ సనత్‌నగర్‌కు చెందిన 72 ఏళ్ల ఒక రియల్ ఎస్టేట్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫేక్ ట్రేడింగ్ యాప్స్ ద్వారా ఏకంగా రూ. 5.95 కోట్లు పోగొట్టుకున్నారు. ముద్రా వన్, 9ప్రో యాప్స్ కన్సల్టెంట్‌గా పరిచయమైన ఒక మహిళ మాటలు నమ్మి కరెన్సీ, కమోడిటీస్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టారు. లాభాలతో కలిపి స్క్రీన్‌పై భారీ మొత్తం కనిపించినా.. విత్‌డ్రా చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు మరిన్ని నిధులు డిమాండ్ చేశారు. చివరకు సదరు యాప్స్ ఓపెన్ కాకపోవటంతో బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు.
Read Entire Article