హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో విల్లాల పేరుతో ఎస్వీఎం ఆదిత్య హోమ్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ సుమారు 20 మంది కొనుగోలుదారుల నుంచి రూ. 15 కోట్లు వసూలు చేసి మోసగించింది. భూమిపై హక్కులు లేకపోయినా, తక్కువ ధరకే విల్లాలు ఇస్తామని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను నమ్మించి నగదు వసూలు చేశారు. బాధితుడు రామారావు ఫిర్యాదుతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు సంస్థ మేనేజింగ్ పార్ట్‌నర్లపై చీటింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.