Hyd: డమ్మీ గన్ చూపించి.. బంగారం ఎత్తుకెళ్లిపోయారు.. వాటి విలువ ఎంతంటే..

6 months ago 18
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ జ్యువెలరీ షాపులో దోపిడీ ప్రయత్నం జరిగింది. శుక్రవారం సాయంత్రం కస్టమర్ల ముసుగులో వచ్చిన ఇద్దరు దుండగులు నకిలీ తుపాకీతో యజమానిని బెదిరించారు. యజమాని అడ్డుకోవడంతో కోపంతో ఊగిపోయిన నిందితులు.. ఇనుప రాడ్‌తో ఆయన తలపై బలంగా కొట్టి సుమారు నాలుగు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన యజమానిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో దొరికిన డమ్మీ గన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ఎస్‌ఓటీ మరియు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.
Read Entire Article