HYD: చర్లపల్లి చెరువు ఒడ్డున క్వింటాళ్లకొద్దీ చేపలు దహనం.. కారణం ఏంటంటే..?

11 months ago 20
హైదరాబాద్‌ చర్లపల్లి చెరువులో స్థానిక మత్స్యకారులు వేలకొలది 'రాక్షసి' చేపలను కాల్చివేశారు. స్థానిక పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయటం, మంచినీటి చేపల్ని వేటాడుతుండటంతో వాటిని పట్టి కాల్చేశారు. ఈ చేపలు ఇతర చేపలను, గుడ్లను తినడమే కాకుండా.. నీటిలోని ఆక్సిజన్‌ను అధికంగా వినియోగించి, మత్స్యకారుల వలలను కూడా పాడు చేస్తున్నాయి. మార్కెట్‌లో వీటికి విలువ లేకపోవడంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులు చేసేదేమీ లేక వాటిని దహనం చేశారు.
Read Entire Article