HYD ఓఆర్ఆర్ అవతలికే పరిశ్రమలు.. మాన్యుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

1 week ago 6
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి 2,100 చదరపు కిలోమీటర్ల కోర్ అర్బన్ ఏరియాను పూర్తిగా కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ నెలకొల్పిన 5.6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను మంత్రి డి.శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపల ఏర్పాటు చేయబోయే మాన్యుఫాక్చరింగ్ జోన్‌కు తరలిస్తామని, 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని సీఎం ప్రకటించారు.
Read Entire Article