వాళ్లంతా కుర్రాళ్లు ఖాళీ దొరికితే క్రికెట్ ఆడేస్తుంటారు. స్కూల్, కాలేజ్ టైమింగ్స్ తర్వాత సరదాగా గ్రౌండ్‌లోకి వచ్చి ఆడేస్తుంటారు. అయితే, ఈ సారి బెట్టింగ్ విషయంలో చిన్న గొడవ రావడంతో కాస్త వివాదం చెలరేగింది. అది కాస్తా బ్యాట్‌లతో దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈ దాడిలో 17 ఏళ్ల ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాలతో పోరాడిన ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన గన్నవరంలో చోటుచేసుకుంది.