Botsa Satyanarayana: వైసీపీ ర్యాలీలో కుప్ప కూలిన బొత్స సత్యనారాయణ

1 year ago 36
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన వాహనంపై నుంచి మైకులో మాట్లాడుతుండగానే అస్వస్థతకు గురవడంతో పార్టీ నేతలు వెంటనే ఆయన్ను వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయపురం నుంచి స్థానిక మూడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో బొత్స పాల్గొన్నారు. ఎండవేడి ఎక్కువగా ఉండటంతో ఆయన వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది.
Read Entire Article