ఈ నెల ఆరంభంలో భీమవరంలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఆటోడ్రైవర్, ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసి పరారయ్యాడు. ఆ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అజ్ఞాతంలో ఉన్న ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఏడాది కాలంలగా వీరిద్దరూ ప్రేమలో ఉండగా.. ఆటో డ్రైవర్‌కి పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దూరంగా పెట్టింది. ఆ కక్షతోనే ఆటో డ్రైవర్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.