ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటున్న ఓ గిరిజన మహిళ ప్రస్తుతం ఆరు నెలల గర్భిణీ. అయితే ఇటీవలే ఆమెకు మెడ, ముఖంపై వాపు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు భయపడిపోయి.. వెంటనే దగ్గర్లోని ఓ భూత వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో అతడు.. ఆమె మెడ వాపును తగ్గించడానికి పంటితో కొరకడం మొదలు పెట్టాడు. ఈ క్రూరమైన చర్యతో సదరు గర్భిణీ.. ఊపిరి కూడా తీసుకోలేక ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. దీంతో భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు అత్యంత చాకచక్యంగా శ్రమించి ఆమెను కాపాడారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.