స్త్రీ శక్తి పథకం కింద నడిచే రద్దీ బస్సుల్లో ఆడవాళ్లను టార్గెట్ చేసుకుని కొన్ని ముఠాలు తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తోటి ప్రయాణికుల్లా బస్సుల్లో ఎక్కి బంగారాన్ని దొంగలించే ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఓ బ్యాచ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డారని.. ఫిర్యాదులు అందడంతో నిఘా పెట్టి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టయిన మహిళలు చిత్తూరు జిల్లాకు చెందిన వారని పాకాల పోలీసులు మీడియాకు తెలిపారు.