సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అమరావతి ఐ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. లండన్ ఐ తరహాలోనే అమరావతిలో కృష్ణా నదీతీరంలో అమరావతి ఐ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లండన్ ఐ.. ఐరోపాలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ తరహాలోనే అమరావతిలో ఏర్పాటుచేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.