AP Cabinet: రేపే ఏపీ కేబినెట్ భేటీ.. లక్షా 61 వేలకోట్ల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్!

1 year ago 25
ఏపీ కేబినెట్ భేటీ రేపు జరగనుంది. సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఓ ముఖ్యమైన భారీ ప్రాజెక్టుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్షా 61 వేలకోట్ల పెట్టబడులు పెట్టేందుకు ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్స్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాయి. దీనిపై రేపటి కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.
Read Entire Article