Ambati rambabu on mahanadu: బ్యాటింగ్‌కు సింగిల్‌గా రా నాయనా.. బౌల్డ్ కాకపోతే అడుగు!

1 year ago 34
కడపలో టీడీపీ మహానాడుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు సంధించారు. వైసీపీ మీద కోపంతోనే కడపలో మహానాడు నిర్వహించారని అన్నారు. కడపలో మూడు రోజుల పాటు జరిగిన మహానాడులో బూతులు, భజనలు తప్ప ఏమీ లేదని అంబటి రాంబాబు విమర్శించారు. కడపలో మహానాడు ఏర్పాటు చేయడం ద్వారా తమకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం టీడీపీ చేసిందన్నారు. మహానాడును లోతుగా పరిశీలిస్తే.. మహానాడులో చంద్రబాబు అభద్రతాభావంతో కనిపించారన్నారు. మూడు రోజులలో తాము ప్రజలకు ఏం చేశామో చెప్పలేకపోయారని విమర్శించారు. రాజకీయాలను కలుషితం చేసింది చంద్రబాబేనని ఆరోపించిన అంబటి రాంబాబు.. సింగిల్‌గా పోటీ చేసి ఒక్కసారి గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. సింగిల్‌గా బ్యాటింగ్‌కు వస్తే క్లీన్ బౌల్డ్ కాక తప్పదంటూ సెటైర్లు వేశారు.
Read Entire Article