భోగాపురం విమానాశ్రయంతో పాటుగా విశాఖ విమానాశ్రయాన్ని కూడా కొనసాగించాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. దేశంలో చాలా చోట్ల రెండు విమానాశ్రయాలు ఉన్నాయని.. విశాఖ మహానగరంగా మారుతున్న సమయంలో ఎయిర్ పోర్టు లేకపోవటం సిగ్గు చేటని అన్నారు. కొన్ని సర్వీసులను అయినా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నడిపించాలని కోరారు. 62 ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు విడాకులు ఇస్తారా అని ప్రశ్నించారు.