36 గంటల పాటు మరమ్మతు పనులు.. ఆ రూట్లో మళ్లీ మొదలైన రైళ్ల రాకపోకలు..

10 months ago 18
గత మూడు రోజులుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రహదారులు కుంగిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక ఇళ్లకు వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ దెబ్బతిని రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు చేయగా.. మరికొన్ని నిలిపివేశారు. అయితే రైల్వే ట్రాక్ పనులను దాదాపు 36 గంటలపాటు రైల్వే సిబ్బంది శ్రమించి మరమ్మతులు పూర్తి చేయడంతో చివరికి రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి.
Read Entire Article