వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. 3 వారాల్లోగా మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. భూవివాదాలు పరిష్కారమైన వెంటనే ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 2028 జూన్ 2 నాటికి ఈ రెండు విమానాశ్రయాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.