వివాదాస్పద కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ ఊరట లభించింది. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు కాగా.. తాజాగా విచారణ జరిపిన కోర్టు.. నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్‌పై నమోదైన ఆ కేసును కొట్టేసింది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షోను బహిష్కరించాలంటూ వీడియో రిలీజ్ చేసిన రాజాసింగ్ ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.