సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలోనే హైదరాబాద్ సంస్థానం జనాభా గణనలో సరికొత్త రికార్డు సృష్టించింది. 1901 నాటి నిజాం రాజ్యంలో కంప్యూటర్లు, కాలిక్యులేటర్లు లేకుండానే కేవలం రంగుల కాగితాలు, ప్రత్యేక చిహ్నాల సాయంతో జనాభాను అత్యంత ఖచ్చితంగా లెక్కించారు. అంతకుముందున్న సంక్లిష్ట 'టాలీ మార్కుల' పద్ధతికి స్వస్తి పలికి.. జర్మనీకి చెందిన బవేరియన్ విధానాన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చి ఈ ప్రయోగం చేశారు. నాటి సెన్సస్ అధిపతి మీర్జా మెహదీ ఖాన్ నేతృత్వంలో సాగిన ఈ వినూత్న ప్రక్రియ ఇప్పటికీ దేశ చరిత్రలో ప్రత్యేకంగానే నిలిచింది.