Eluru Parents Complaint On 15 Years Son On Mobile Addiction:ఏలూరులో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. కొడుకుపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా ఆ బాలుడు మొబైల్‌కు బానిసగా మారాడు. చదువును పక్కన పెట్టి సోషల్ మీడియాతో పాటుగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. రాత్రిళ్లు గేమ్స్.. పగటిపూట నిద్రపోతున్నాడు. కొడుకుతో విసిగిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడ్ని డీ అడిక్షన్ సెంటర్‌రకు తరలింలచారు.