హైదరాబాద్‌లో కల్తీ ఆహారంపై హెచ్ ఫాస్ట్ ప్రత్యేక బృందం ఉక్కుపాదం మోపింది. కేవలం 100 రోజుల్లోనే 185 కేసులు నమోదు చేసి 121 టన్నుల నాసిరకం, కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. కెమికల్స్‌తో పండించిన పండ్లు, నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ వ్యర్థాలు, కల్తీ పన్నీర్, ఖోవా, నెయ్యి వంటి పదార్థాలు భారీగా పట్టుబడ్డాయి. కల్తీ వ్యాపారులపై అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.