హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బట్టల గోడౌన్‌లో మంటలు, భయంతో జనం పరుగులు

2 weeks ago 14
దసరా పండుగ వేళ హైదరాబాద్‌ మదీనా క్రాస్‌రోడ్డు సమీపంలో బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుస్తులు, ఇతర సామగ్రి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ప్రమాదం జరిగిన వెంటనే జనం ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆస్తి నష్టం, ప్రాణనష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article