హైదరాబాద్‌లో ఇల్లు లేని వారికి అద్భుత అవకాశం.. రూ.19 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్..

6 months ago 30
తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (TGRSCL) హైదరాబాద్‌లో సొంతింటి కల కలిగిన వారి కోసం 289 రెడీ-టు-మూవ్ ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నల్లగండ్ల, మియాపూర్, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఉన్న ఈ 1BHK, 2BHK ఫ్లాట్లను పారదర్శకమైన ఆన్‌లైన్ లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. సింగిల్ బెడ్రూమ్ ధరలు రూ. 13 లక్షల నుండి ప్రారంభం కాగా.. డబుల్ బెడ్రూమ్ ధరలు రూ. 19 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తుదారులు జనవరి 31 లోపు టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో లాటరీ డ్రా నిర్వహిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సొంత ఇల్లు లేని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ నిబంధన కూడా ఉంది.
Read Entire Article