హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి హెచ్‌ఎండీఏ వారణాసి మోడల్ రోప్‌వే వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. గోల్కొండ, టూంబ్స్, జూ పార్క్, ఐటీ కారిడార్లలో పీపీపీ విధానంలో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో స్టేషన్ల నుంచి కనెక్టివిటీగా, పర్యాటక సర్క్యూట్‌లుగా ఇవి పనిచేస్తాయి. ప్రైవేటు ఆస్తులపై నుంచి రోప్‌వే వెళ్లేలా పాలసీలో మార్పులు చేస్తూ.. తక్కువ సమయంలో సురక్షిత ప్రయాణాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.