హైదరాబాద్ మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఇకపై ఆ బాధలుండవు

1 year ago 28
హైదరాబాద్ నగర మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్, శివారు మున్సిపాలిటీల్లో మరిన్ని మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా మహిళలు తక్కువ వడ్డీకే రుణాలు పొంది ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. దీని గురించి స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఇందిరా మహిళా శక్తి భవన్ ద్వారా కొత్త సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Read Entire Article