హైదరాబాద్‌ తాగునీటి కష్టాలకు చెక్.. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌కు గోదావరి జలాలు

4 days ago 5
హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు మూసీ పునరుజ్జీవనానికి దోహదపడే గోదావరి మంచినీటి సరఫరా పథకం ఫేజ్‌-2లో కీలక ముందడుగు పడింది. ప్యాకేజీ-2 పనులకు 2026 జూన్‌ 24ను నియామక తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు రూ.7,360 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే.. నగరానికి అదనంగా 172 ఎంజీడీల నీరు అందుబాటులోకి రానుంది. ఘన్‌పూర్‌ నుంచి ఉస్మాన్‌సాగర్‌, ముత్తంగి వరకు భారీ పైప్‌లైన్లు, పంపింగ్‌ వ్యవస్థలు నిర్మించనున్నారు. ఉస్మాన్‌సాగర్‌ వద్ద 120 ఎంఎల్‌డీ, హిమాయత్‌సాగర్‌ వద్ద 70 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article