సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. ఆ కేసును కొట్టేసిన హైకోర్టు..

11 months ago 20
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి న్యాయస్థానాల నుంచి అనుకూలమైన తీర్పులు వస్తున్నాయి. గతంలో ఆయనపై నమోదైన పలు కేసులను తెలంగాణ హైకోర్టు, నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులు కొట్టేశాయి. 2019 నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు.. 2021 నాటి నిరసన కేసులను న్యాయస్థానాలు రద్దు చేశాయి. అంతేకాకుండా.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు మందలించింది. ఈ తీర్పులు సీఎంకు చట్టపరమైన ఇబ్బందుల నుండి విముక్తిని కలిగించి.. పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు తోడ్పడతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article